Saindhav: వెంకటేశ్‌ సైంధవ్‌ బ్రేక్ ఈవెన్ ని సాధించేనా…..

-

హిట్ ఫేం శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్‌ హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం సైంధవ్‌. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించింది .నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన సైంధవ్‌ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వెంకటేశ్‌ 75వ సినిమాగా భారీ అంచనాల మధ్య తెలుగు,మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే సంక్రాంతికి విడుదలైన మిగతా చిత్రాల కారణంగా ఫెస్టివల్‌ వీకెండ్‌ అయినప్పటికీ ఆక్యుపెన్సీ భారీ మొత్తంలో పడిపోయినట్టు తెలస్తోంది. ఇప్పటివరకున్న స్పందన చూస్తుంటే రాబోయే రోజుల్లో మేకర్స్‌కు నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు . నిర్మాతలు సేఫ్‌ జోన్‌లోకి రావాలంటే సైంధవ్‌ రూ.15 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది .మరి ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వస్తుందా..? లేదా ..? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version