రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ‘ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు’ సదస్సు జరిగింది. ఇందులో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారత్‌లో రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య అన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదన్నారు. రైతులకు సరైన లాభాలు రావడం లేదని.. తెలంగాణలో మాది రైతు ప్రభుత్వమని చెప్పారు. రైతు భరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామన్నారు.
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నమని.. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99శాతం ఉండడవన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమని, ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు స్థిరమైన మోడల్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని.. రైతులు ఎప్పుడూ ప్రపంచానికి సహాయం చేస్తూనే ఉన్నారని.. ఇప్పుడు ప్రపంచం రైతులకు అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.