ఈ రోజు అన్నమయ్య జిల్లా పుంగనూరు లో టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో దాడికి దిగిన విషయం రాష్ట్రము అంతటా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ విషయంపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల మాట్లాడుతూ, ఈ రోజు పుంగనూరు లో జరిగిన విద్వంస ఖాండ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే ఈ ఘర్షణలకు కారణమని సజ్జల చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు ముందుగా చెప్పిన విధంగా టీడీపీ కార్యకర్తలు బీరు బాటిళ్లు, కర్రలతో పోలీసులపై మరియు వైసీపీ నేతలపై దాడికి దిగారని సజ్జల చెప్పారు. ఇంతకాలం రాజకీయ అనుభవస్తుడని అని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు అనుభవం ఈ రోజు ఏమైందని సజ్జల ఫైర్ అయ్యారు..
అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేయడానికి సిద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి
-