నిన్న వెస్ట్ ఇండీస్ మరియు ఇండియా జట్ల మధ్య జరిగిన మొదటి టీ 20 లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రం చేశాడు. ఆరంభం నుండి దూకుడైన ఆటతీరుతో ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. అయితే ఛేజింగ్ చేస్తున్నాడని తిలక్ వర్మ మరిచిపోయినట్లు ఉన్నారు. మాములుగా మ్యాచ్ లలో ప్రత్యర్థి టీం ముందంజలో ఉన్నపుడు, వికెట్లు వరుసగా పడుతున్నప్పుడు వారిని ఒకింత కన్ఫ్యూజ్ చేయడానికి ఫోర్లు సిక్సులు కొడుతూ ఉంటారు. నిన్న మ్యాచ్ లోనూ తిలక్ వర్మ అదే పని చేశాడు. కానీ అదే సమయంలో వికెట్ ను కాపాడుకోవాలన్న విషయాన్ని మరిచిపోయి, టీం పటిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను అయిదు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.
INDIAN YOUNG TALENT: తిలక్ వర్మ తొందర తగ్గించుకుంటే ఇండియాకు “కీ” ప్లేయర్ అవుతాడు
-