హైటెక్ హంగులతో రూపొందించిన లహరి ఏసి స్లీపర్ ఏసి స్లీపర్ కం సీటర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి మనకి తెలుసు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు లకి ధీటుగా ఈ బస్సులు ని రూపొందించారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. వేసవిలో చల్లదనం అందించడానికి టీఎస్ఆర్టిసి లహరి ఏసి స్లీపర్ కం సీటర్ బస్సు సేవల్ని వినియోగించుకోవాలని అన్నారు.
లహరి-ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు💙
వేసవిలో చల్లదనం అందించే #TSRTC లహరి- ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకోండి. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, అదిలాబాద్, నిజమాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర… pic.twitter.com/c0wJSkggbs
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 18, 2024
ఈ బస్సులు హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుపతి చెన్నై వైజాగ్ విజయవాడ మంచూరియాల ఆదిలాబాద్ నిజామాబాద్ నాగపూర్ షిరిడి సత్తుపల్లి తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు ప్రస్తుతం పోస్ట్ ఆసక్తికరంగా మారింది. వీడియోని కూడా షేర్ చేశారు.