చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ అతడి వీడియోని పోస్ట్ చేసిన సజ్జనర్

-

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నకిలీ వీడియో గురించి టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. ఇటువంటి వీడియోలు పోస్ట్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్‌ మీడియాలో పాపులర్‌ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎక్స్(ట్విట్టర్) లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version