త్వరలో రేషన్ షాపుల్లో చిన్న ఎల్​పీజీ సిలిండర్ల అమ్మకం…!

-

రేషన్ షాపుల్లో పలు సామాన్లని సబ్సిడీపై విక్రయిస్తుంటారు. అయితే రానున్న రోజుల్లో చిన్న ఎల్పీజీ గ్యాస్ ​సిలీండర్​ కూడా దీనిలో చేరనుంది. చిన్న తరహా LPG సిలీండర్ల తో పాటు ఆర్థిక సేవలను తీసుకు రావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ అవుట్ లెట్ల ఆర్థిక సాధ్యతను పెంపొందించే చర్యల లో భాగంగా ప్రణాళిక తీసుకు రానున్నారు.

gas

ఈ మేరకు ఫుడ్ సెక్రటిరీ సుధాన్షు పాండే రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన వర్చువల్ సమావేశం లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశం తో ప్రకటనని తీసుకొచ్చారు. ఈ సమావేశానికి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు కూడా వచ్చారు.

అలానే మూల ధన పెంపు కోసం ముద్రా రుణాలు అందించాలని ప్రభుత్వం అనుకుంటోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లో వేర్వేరు వర్క్ షాపులు లేదా వెబినార్లను నిర్వహించాలని ఆహార కార్యదర్శికి సీఎస్సీ సూచించారు. రానున్న కాలంలో రేషన్ దుకాణాల లో ఎల్పీజీ సిలీండర్ల తో పాటు ఆర్థిక సేవలు వినియోగదారులకు కల్పించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version