ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పిచ్ ఏదైనా సన్ రైజర్స్ తలరాత మాత్రం మారడం లేదని అన్నాడు.వరుసగా రెండోసారి ఓటమిపాలైన హైదరాబాద్ టీమ్ గురించి మాట్లాడుతూ మొదటి మ్యాచ్ తో పోలిస్తే గత మ్యాచ్లో ఆఖరివరకు పోరాడిందన్నారు.లక్నో తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడింది, ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ బట్ పలు సందేహాలను వెలిబుచ్చాడు.హైదరాబాద్ ఆటగాళ్ళు ప్రదర్శన ఆకట్టుకోలేదు అన్నాడు.అంతే కాకుండా యాజమాన్యంతో ఆ జట్టు సభ్యులకు ఏదో తేడా కొట్టినట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
“హైదరాబాద్ జట్టు ఏం మారలేదు”. పిచ్ ఏదైనా సరే వారి తలరాత మాత్రం మారడం లేదు అందుకే ఈ జట్టుతో పాటు ఫ్రాంచైజీ లోను ఏదో లోపం ఉంది ఉందనిపిస్తుంది అని సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నాడు.దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని సల్మాన్ బట్ తెలిపాడు. టాప్ ఆర్డర్ లో చాలా దూకుడుగా ఆడే ఆటగాడు మార్క్రమ్ అని అతన్ని టాప్ ఆర్డర్లో కాకుండా నాలుగు ఐదో స్థానంలో బ్యాటింగ్ కి పంపుతున్నారని టాప్ ఆర్డర్లో అయితే దూకుడుగా ఆడగలడు అని అన్నాడు సల్మాన్ బట్.