మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా.. కేటీఆర్‌‌కు టెస్టులు చేయిస్తావా : రేవంత్ సవాల్

-

రాడికల్ పబ్ పై టాస్క్ ఫోర్స్ దాడి ఘటనపై కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు అనుమానం ఉన్న మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకువస్తా.. డ్రగ్స్ టెస్ట్ కు నీ కొడుకు కేటీఆర్ ను పంపుతావా అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సవాల్ విసిరారు రేవంత్.

రేవంత్ రెడ్డి కేటీఆర్ | Revanth Reddy KTR

పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్ లో సుమారు 142 మంది చిక్కారని.. అయితే వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించకుండా ఎందుకు వదిలేశారని నిలదీశారు. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

టాస్క్ఫోర్స్ దాడుల అనంతరం అధికారులకూ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి చూసీచూడనట్లు వదిలేయమని… చెప్పి ఉండవచ్చని ఆరోపించారు రేవంత్ రెడ్డి. పబ్ లో దొరికిన వాళ్లలో మా బంధువులు ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారని… ఎవరి మీద అనుమానం ఉంటే వారి సమాచారం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version