సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. బాంబుతో పేల్చేస్తామని!

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.సోమవారం ముంబాయి వర్లీ ప్రాంతంలోని రవాణా శాఖ కార్యాలయ అధికారిక నంబర్‌కు వాట్సాప్ ద్వారా హత్య బెదిరింపు వచ్చినట్లు సమాచారం. సల్మాన్ ఇంట్లోకి చొరబడి చంపేస్తామని, అతని కారులో బాంబు పెట్టి పేల్చివేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

దీంతో వర్లి పోలీస్ స్టేషన్‌‌కు సందేశం పంపిన గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా,గత కొన్ని ఏళ్లుగా సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యక్షంగా,పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే, బిష్ణోయ్, అతని తమ్ముడు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news