పెళ్లి కావడం లేదని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లాలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన నీలిమ 2020 బ్యాచ్ ఏఆర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యింది.

ట్రైనింగ్ అనంతరం వరంగల్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నది.గత కొద్ది కాలం నుంచి నీలిమకు వరుసగా పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా నిశ్చయం అవ్వలేదు.ఆమెను చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మనస్తాపం చెందిన నీలిమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.