బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐదు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాడు. అయితే ఇన్ని ఏళ్లు వచ్చినా.. పెళ్లికి మాత్రం ఎస్ చెప్పడం లేదు సల్లూ బాయ్. గతంలో అనేక సార్లు పలువురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు, డేటింగ్ లు జరిపాడు. అయినా ఈ లవ్ ట్రాక్ లను పెళ్లిదాకా తీసుకుపోలేకపోయాడు ఈ దబాంగ్ హీరో. అందాల తార ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ ఇలా చాలా మందితోనూ లవ్ ట్రాక్ నడిపినట్లు సల్మాాన్ ఖాన్ కు పేరుంది.
ఇదిలా ఉంటే ఇటీలవ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సల్మాన్ ఖాన్, సోనాక్షిలు రింగ్స్ మార్చుకుంటున్న ఫోటోలు తెగవైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఫోటోలపై సోనాక్షి సిన్హా స్పందించింది. ‘‘ రియల్ ఫోటోకు మార్ఫింగ్ ఫోటోకు తేడా తెలియనంత మూర్ఖంగా తయారయ్యారా..? అంటూ వీరిద్దరు రింగులు మార్చుకుంటున్న పిక్స్ ను వైరల్ చేస్తున్నవారిపై మండిపడింది. గతంలో వీరిద్దరు కలిసి ‘దబాంగ్’ సినిమాలో నటించారు. ఈసినిమా భారీ సక్సెస్ అయింది.