అరుదైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ ఖాన్..!!

-

బాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోలుగా సాగుతున్న హీరోలలో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉంటారు. అంతే కాదు బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 50 సంవత్సరాల వయస్సు దాటినా ఇంకా వివాహం చేసుకోకుండా వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ తనకు నచ్చిన అమ్మాయి తో సమయాన్ని గడుపుతూ ఉంటాడే కానీ ఏ ఒక్క అమ్మాయి తో కూడా అసభ్యకరంగా ప్రవర్తించిందిలేదు.. ఐశ్వర్యరాయ్ ని విపరీతంగా ప్రేమించిన సల్మాన్ ఖాన్ ఆమెతో బ్రేకప్ అయిన తర్వాత మరే ఒక్క అమ్మాయితో కూడా ఈ వివాహబంధం వైపు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయలేదు అన్నట్లుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ అభిమానులు ఇప్పటికీ కూడా వివాహం చేసుకుంటాడు అని ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

కేవలం హిందీలోనే కాకుండా యావత్ సినీ ప్రపంచానికి స్టార్ హీరో గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన తాజాగా గత కొన్ని సంవత్సరాల నుంచి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. తాజాగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ లైక్ చిత్రానికీ సంబంధించి ఒక పాటను దుబాయ్ లో విడుదల చేయడానికి వెళ్లిన ఆయన మీడియాతో కూడా ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన తన వ్యాధి గురించి కూడా వెల్లడించాడు.

సల్మాన్ ఖాన్ ఫేషియల్ సర్వ్ డిజార్డర్స్, ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారట. అయితే ఈ వ్యాధి బారిన పడ్డ వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తుందట. అయితే ఈ వ్యాధిని అధిగమించేందుకు సల్మాన్ ఖాన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. తనను వేధిస్తున్న నరాల రుగ్మత గురించి కూడా పూర్తిగా తెలియజేశాడు. తను ఈ బాధను అధిగమించేందుకు ఏదో ఒక పని మీద దృష్టి పెడుతూ ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాను అని సల్మాన్ ఖాన్ మీడియాతో వెల్లడించారు దీంతో ఆయన అభిమానులు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version