దేశ చరిత్రను తిరగరాసిన యువతి..మొదటి లైన్ ఉమెన్ గా ఉద్యోగం..

-

ఒకప్పుడు ఆడవాళ్ళు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యారు. మగ వాళ్ళు చెప్పిన మాటలను వినాలి..ఇలాంటి మాటలు ఒకప్పుడు విన్నారు.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.మేము ఎందులొనూ తక్కువ కాము అని నిరుపిస్తున్నారు.చదువు, ఉద్యోగాలు, ఇతరుల రంగాలలో కూడా రానిస్తున్నారు.ఇప్పుడు మాత్రం అన్నిటిలో సమానంగా రానిస్తున్నారు. ముఖ్యంగా విద్యా, ఉద్యోగం లలో పోటీ పడుతున్నారు..సాదారణ ఉద్యోగాల సంగతి అయితే ఓకే కానీ, కరెంట్ స్తంబాలు ఎక్కే పని అంటే కేవలం మగవాళ్ళు మాత్రమే చేస్తారు.ఆడవాళ్ళను అలాంటి ఉద్యోగాలు చెయ్యరు.

అందరి అంచానాలను మించి ఓ యువతి మహిళలకు ఆదర్శంగా నిలిచింది.విషయాన్నికొస్తే.. లైన్ ఉమెన్‌గా  ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని అందించి అభినందించారు మంత్రి జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బబ్బూరి శిరీష అనే మహిళ టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో ఉద్యోగుల నోటిఫికేషన్‌లో భాగంగా లైన్ ఉమెన్‌గా అప్లై చేసుకుంది.దేశ చరిత్రలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టీఎస్ ఎస్పీడిసిఎల్ నిలుస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని ఆడుగడున అడ్డుపడుతోంది. విద్యుత్ కోరుత కలిగించేలా పావులు కదుపుతుంది.కానీ తెరాస సర్కార్ వాటికి చెక్ పెడుతుంది.రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత  లేదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు..అనంతరం.. శిరీష మాట్లాడుతూ..ఒక మహిళగా టీఎస్ ఎస్పీడిసిఎల్ సంస్థలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చని.. తాను కష్టపడి పనిచేసి సంస్థకు పేరు తెస్తానని శిరీష పేర్కొన్నారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థకు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి ,సీఎండీ రఘుమారెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ప్రస్తుతం శిరీషకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version