సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. తన భర్త నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత ఆ బాధ ను మర్చిపోవడానికి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నది సమంత. అందులో అక్షయ్ కుమార్ తో కలిసి సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక నాగచైతన్య గురించి, విడాకుల గురించి, పలు ప్రశ్నలకు సమాధానం తెలిపినట్లుగా తెలుస్తోంది .. వాటి గురించి చూద్దాం.
విడిపోవడం సామరస్యంగానే జరిగింది అని, విడిపోయిన తర్వాత చాలా మనోవేదనకు గురైనట్లుగా తెలియజేసింది సమంత. అయితే ప్రస్తుతం తామిద్దరి మధ్య ఎలాంటి మాటలు కూడా లేవని భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రావొచ్చేమో అన్నట్లుగా తెలియజేసింది. ఇక విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయం పైన కూడా సమంత మాట్లాడుతూ నేను విడాకులు తీసుకున్న తర్వాత తన మీద చాలామంది నెగటివ్ కామెంట్ చేశారు. వాటిపై నేను ఫిర్యాదు చేయలేకపోయాను. కేవలం నేను సైలెంట్ గా ఉండాలనుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలను తెలియజేసి విడిపోయా అంటూ తెలియజేసింది. ఇక అంతే కాకుండా తాను రూ. 200 కోట్ల రూపాయలు భరణం తీసుకున్నారు అని వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదని తెలియజేసింది సమంత.