Samantha : ఎన్టీఆర్‌ సినిమాను వదులుకున్న సమంత..!

-

‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తోన్న ఫిల్మ్ ‘NTR 30’. గతంలో తారక్-కొరటాల కాంబోలో ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బాస్టర్ కాగా, ఈసారి పాన్ ఇండియా వైడ్ ఫిల్మ్ చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ ను ఫిక్స్ చేశారని గతంలో వార్తలొచ్చాయి.


అయితే..మొదటగా ఈ సినిమాలో కొరటాల.. సమంతను హీరోయిన్‌ గా తీసుకోవాలని అనుకున్నారట. గతంలో ఎన్టీఆర్‌ తో కలిసి…. జనతా గ్యారేజ్‌ లో నటించింది సమంత. దానికి దర్శకుడు కూడా కొరటాల శివ అనే విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి వీరి జోడిని ఎన్టీఆర్‌ 30లో కంటీన్యూ చేయాలని కొరటాల భావించాడు. కానీ.. రెమ్యూనరేషన్‌ విషయంలో.. సమంత అస్సలు కాంప్రమైజ్‌ కాలేదట.  ఈ సినిమా కోసం సమంత రూ.4 కోట్లు వసూలు చేసిందని టాక్‌.  అంత ఇచ్చేందుకు చిత్ర బృందం ముందుకు రాకపోవడంతో…  సమంత.. ఆ సినిమాను వదులుకుందని టాక్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version