ఆ వ్యక్తితో సన్నిహితంగా సమంత.. ఆయనెవరంటే?

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. చాలా మంది అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు వారిరువురు విడిపోవద్దని కోరుకున్నారు. కానీ, సోషల్ మీడియా వేదికగా డైవోర్స్ ప్రకటించారు నాగచైతన్య, సమంతలు. ఇకపోతే విడాకుల తర్వాత ఇద్దరూ ప్రొఫెషనల్ లైఫ్‌పై ఫుల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. సమంత వరుస చిత్రాలకు ఓకే చెప్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటి సంపాదించుకున్న సమంత.. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది.

ప్రకృతి ప్రియమైన ‘శాకుంతలం’ సినిమా షూట్ పూర్తి కాగా, ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌కు కూడా సమంత రూత్ ప్రభు ఓకే చెప్పేసింది. ఈ సంగతులు అలా ఉంచితే.. వైవాహిక బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంత మరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నదని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి తెగ వైరలవుతోంది.

సదరు వ్యక్తితో సమంత దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఉన్న వ్యక్తి పేరు బెన్ నే. కాగా, ఆయన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు ఈయనే యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ‘యశోద’ సినిమాకు కూడా బెన్ నేనే యాక్షన్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయనతో ఉన్న పరిచయం వలన సమంత ఆయనతో సన్నిహితంగా మెలుగుతోంది.

ఈ సందర్భంగా దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇకపోతే సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో ఐటెం సాంగ్ చేయగా, దానికి మంచి పేరొచ్చింది. ఇటీవల ఆ చిత్రం విడుదల కాగా, ‘ఊ అంటావా ..ఊఊ అంటావా’ సాంగ్ నేషన్ వైడ్‌గా ఫుల్ పాపులర్ అయింది. సాంగ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సమానంగా స్టెప్పులేసి పాటను ఇంకా హైలైట్ అయ్యేలా సమంత చేసిందని ప్రేక్షకులు అంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version