సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్ వరలక్ష్మీ శరత్ కుమార్ రావు రమేష్ మురళీ శర్మ సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది.సినిమాతో గురించి నిర్మాత పలు విషయాలు గురించి మాట్లాడారు.
దానిలో భాగంగా ముందు ఈ సినిమా కథ కొత్త దర్శకుల వద్ద వుందని తెలిసింది. వారిని పిలిపించి మొత్తం కథ విన్నాను. విన్న తర్వాత బడ్జెట్ ఎంత అవుతుంది అని అడిగితే నాలుగు కోట్లు అని అనుకుంటున్నాము అనే సరికి, ఇంత తక్కువ బడ్జెట్ తో కాదని మళ్లీ స్క్రిప్ట్ వర్క్ పక్కాగా చేయమని బడ్జెట్ విషయాలు నేను చూసుకుంటా అని చెప్పాను. ఇక బౌండెడ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తరువాత లీడ్ హీరోయిన్ వేటలో పడ్డాము.
మాకు ఈ సినిమా కొంత స్టేచర్ వుండి, దేశం మొత్తంలో గుర్తింపు వున్న పాన్ ఇండియా హీరోయిన్ వేటలో వుంటే లక్కీ గా సమంత మేనేజర్ గారు మేడం కథ నచ్చితే చేస్తారు అనే సరికి మాకు దైర్యం వచ్చింది. ఎందుకంటే సమంత కు మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్ వుంది. ఆమె ఒప్పుకుంటే చాలు మా సినిమా హిట్ అవుతుంది అని ముందే అనుకున్నాం. స్క్రిప్ట్ విన్న వెంటనే అమె ఓకే అన్నారు. దానితో నాకు కొండంత దైర్యం వచ్చిందని, సినిమా ను నలభై కోట్లతో మంచిగా తీశానని ఇది అందరికి నచ్చేలా వుంటుందని , ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు.