ఢిల్లీ నుండి IRCTC చార్‌ధామ్ యాత్ర టూర్ ప్యాకేజీ…. 12 రోజుల యాత్ర.. పూర్తి వివరాలు మీకోసం..!

-

ఐఆర్‌సీటీసీ టూరిజం వివిధ రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లు వేస్తున్నారు. చార్‌ధామ్ యాత్ర ఇప్పుడు మళ్ళీ మొదలు అవ్వనుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ని చూడాలని అనుకుంటే ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ తో ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు. న్యూ ఢిల్లీ నుంచి ఈ టూర్ ప్యాకేజీ మొదలు అవ్వనుంది.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. మే 1, మే 15, జూన్ 1, జూన్ 15, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 15 తేదీల్లో ఈ ప్యాకేజీ ఉంటుంది. పర్యాటకులు ముందుగా చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వుంది. ఢిల్లీలో మొదటి రోజు ఇది మొదలు అవుతుంది. రాత్రికి హరిద్వార్ చేరుకుంటారు. రెండో రోజు హరిద్వార్ నుంచి బార్‌కోట్ కి స్టార్ట్ అవ్వాలి. మూడో రోజు యమునోత్రి చూడచ్చు.

పర్యాటకులు సొంత ఖర్చులతో పోనీ, పల్లకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగో రోజు ఉత్తరకాశీ వెళ్లాల్సి వుంది. బ్రహ్మకాల్ దగ్గర ప్రకటేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని చూడచ్చు. సాయంత్రం కాశీ విశ్వనాథ్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ఉత్తరకాశీలో ఉండాలి. ఐదో రోజు గంగోత్రి. భగీరథి నది గుండా ప్రయాణించవచ్చు. గంగోత్రి ఆలయంలో గంగాదేవీ దర్శనం చేసుకుని. ఆరో రోజు గుప్తకాశీ, సీతాపూర్ వెళ్ళాలి. ఏడో రోజు సోన్‌ప్రయాగ్ దగ్గర కేదార్‌నాథ్ వెళ్లేందుకు పోనీ, పల్లకి సేవల్ని బుక్ చేసుకోవాలి.

కేదార్‌నాథ్ ఆలయానికి సాయంత్రం వెళ్లాల్సి వుంది. ఎనిమిదో రోజు కేదార్‌నాథ్ అలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. తర్వాత గుప్తకాశీ వెళ్ళాలి. తొమ్మిదో రోజు బద్రీనాథ్. దారిలో జోషీమఠ్‌ లో నర్సింగ్ స్వామి ఆలయం చూడచ్చు. సాయంత్రం బద్రీనాథ్ రీచ్ అవుతారు. తర్వాత బద్రీనాథ్ ఆలయాన్ని చూడచ్చు. పదకొండో రోజు రుద్రప్రయాగ్. సాయంత్రం గంగా హారతి చూడచ్చు. రాత్రికి హరిద్వార్‌లో ఉండాలి. పన్నెండో రోజు తిరుగు ప్రయాణం. ఇక ధర విషయానికి వస్తే.. ఈ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.59,360, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.62,790, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.88,450 గా వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version