ఒకే గెటప్ బాలయ్య, చిరు.. అభిమానులను మెప్పించింది ఎవరు..!!

-

సినీ ఇండస్ట్రీలో చాలావరకు కథలను పోలిన కథలను హీరోలు తెరకెక్కించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం గెటప్ ను పోలిన గెటప్ ని తెరకెక్కించడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించినా ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారు అంటూ ఇండస్ట్రీలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్త వైరల్ అవ్వడానికి కారణం నిన్న మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి విడుదలైన చిరంజీవి ఫస్ట్ లుక్ టీజర్.. దీనిని చూసినవాళ్లంతా బాలయ్య ని ఫాలో అవుతున్నారు మెగాస్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మొట్టమొదటిసారి బాలయ్య బాబు తండ్రి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కూతురిగా శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు యంగ్ హీరో గానే కనిపించిన బాలయ్య ఇప్పుడు తండ్రిగా కనిపించబోతుండడంతో మొదట విమర్శలు తలెత్తినా ఆ తర్వాత బాలయ్య లుక్ చూసి ప్రతి ఒక్కరు సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య ఎలా ఉండబోతున్నాడు.. తండ్రి కూతుర్లుగా మెప్పిస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి కానీ బాలయ్య గెటప్ కి మాత్రం అందరూ ఫిదా అని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా.. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్.

ఇక ఈ సినిమా నుంచి నిన్న సాయంత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను వదలగా చిరంజీవి గెటప్, బాలయ్య గెటప్ రెండు ఒకేలాగా ఉండడం చూసి చిరంజీవి బాలయ్య ను ఫాలో అవుతున్నారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ఫోటోలను పక్కన పెట్టి మనం చూసినట్లయితే ఇద్దరూ ఒకరికొకరు సేమ్ గెట్ అప్ లలో కనిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఒకే గెట్ అప్ లో కనిపించనున్న ఈ స్టార్ హీరోలలో ఎవరు సక్సెస్ అవుతారో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ రెండు గెటప్ లలో ఎవరు అభిమానులను మెప్పించారు అనే విషయాన్నికొస్తే రెండు గెటప్ లు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయని చెప్పవచ్చు..అయితే ఒకే గెట్ అప్ లో కనిపించనున్న ఈ స్టార్ హీరోల సినిమాలలో ప్రేక్షకులకు నచ్చుతుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version