ఏపీ పంచాయతీరాజ్ శాఖ బాగా పని చేస్తోందని జాతీయ స్ధాయిలో పవన్ కళ్యాణ్ గుర్తింపు తెచ్చారు. సర్పంచులకు లక్ష రూపాయల నిధులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. గత ప్రభుత్వం లో పంచాయతీరాజ్ శాఖలో ఎంపీటీసీ, జడ్పీటీసీ లను పట్టించుకోలేదు. జనసేన పార్టీని క్షేత్రస్ధాయి నుంచీ బలోపేతం చేయాలని పని చేస్తున్నాం. పార్టీ పటిష్ఠత మాపైన ఉన్న బాధ్యత. ప్లీనరి సమావేశాల అనంతరం సమన్వయకర్తల విషయంలో నిర్ణయాలు తీసుకుంటాం.
ఇక ర్యాంకింగ్ అంటే.. అన్ని సబ్జెక్టుల్లోనూ స్టూడెంట్ కి ఒకేలా మార్కులు రావు. పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలు కీలకమైనవి.. పదవ ర్యాంకు తప్పేమీ కాదు. ఇక ప్రజారాజ్యమే.. జనసేన అనడం నిజమే. చిరంజీవి ఎప్పుడూ తమ్ముడికి సపోర్టుగా ఉంటారు. అలాగే కిరణ్ రాయల్ అంశంలో ప్రతిపక్ష పార్టీ బురదజల్లాలని చూస్తోంది. అభియోగాలపై విచారణ జరుగుతోంది. నాకు తెలిసినంత వరకూ అతనిపై కావాలనే కుట్ర జరుగుతోంది.