ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. వాషింగ్ మిషన్ ని వాడేటప్పుడు ఈ తప్పులను చేయకండి..!

-

చాలా మంది సమయాన్ని ఆదా చేయడానికి మరియు పనులను సులభం చేసుకోవడానికి వాషింగ్ మిషన్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దానివలన మహిళలకు ఎంతో మేలు అనే చెప్పవచ్చు. వాషింగ్ మిషన్ లో బట్టలను ఉతకడం ఎంతో సులభం మరియు చాలా మంది తెలియక బట్టలను ఉతికేటప్పుడు మరియు ఉతికిన తర్వాత కూడా ఎన్నో పొరపాట్లను చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. బట్టలను ఉతుకుతున్న సమయంలో ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో ఉతికిన బట్టలను ఆరబెట్టడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

చాలా శాతం మంది ఇతర పనులు వలన వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అలానే వదిలేస్తారు మరియు మిషన్ ఆగిపోయిన తర్వాత బట్టలను ఆరబెట్టకుండా అదే విధంగా ఉంచుతారు. కొంతమంది బట్టలను రాత్రి ఉతుకుతారు మరియు వాటిని మిషన్ లోనే ఉంచి ఉదయాన్నే ఆరబెడతారు. ఇలా చేయడం వలన ఎంతో బ్యాక్టీరియా పేరుకుపోతుంది దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాషింగ్ మిషన్ నుండి బట్టలు తీసిన తర్వాత మూత వేయకూడదు.

ఎప్పుడైతే మిషన్ తడిగా ఉన్నప్పుడు మూతను వేస్తారో మిషన్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. కనుక బట్టలను ఉతికిన వెంటనే ఆరబెట్టాలి మరియు బట్టలు తీసిన తర్వాత కొంత సమయం వాషింగ్ మిషన్ మూత తీసే ఉంచాలి. అంతేకాకుండా బట్టలను ఉతికిన తర్వాత నెలకు ఒకసారి అయినా వాషింగ్ మిషన్ ను కూడా శుభ్రం చేయాలి. మిషన్ లో బ్యాక్టీరియా మరియు మురికి చేరుకొని ఉండిపోతుంది. కనుక బట్టలను ఉతకడంతో పాటుగా వాషింగ్ మిషన్ కూడా తరచుగా శుభ్రం చేస్తూ ఉండడం ఎంతో అవసరం. ఈ విధమైన జాగ్రత్తలను తీసుకోవడం వలన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version