మంత్రి అనిల్ కుమార్ కు సంపూర్ణేష్ బాబు కౌంటర్!

-

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు… రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వరుసగా… ప్రెస్మీట్లు పెట్టి… కౌంటర్ లు ఇస్తున్నారు ఏపీ మంత్రులు. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ఆన్లైన్లో టికెట్లు అంతే పవన్ కళ్యాణ్ కు ఏమౌతుంది అని ప్రశ్నించారు.

అంతేకాదు తమకు సంపూర్ణేష్ బాబు అయినా… పవన్ కళ్యాణ్ అయినా ఒకటేనని చురకలంటించారు అనిల్ కుమార్. అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై హీరో సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ గారి తో తనను సమానంగా చూడటం చాలా సంతోషకరం గా ఉందని.. వెంటనే చిత్రపరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు సంపూర్ణేష్ బాబు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. “మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు.” అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version