రైతుల దేశవ్యాప్త బంద్ కు మావోయిస్ట్ పార్టీ మద్దతు.. అభయ్ పేరుతో లేఖ విడుదల

-

సాగు చట్టాలను వ్యతిరేఖిస్తు దేశవ్యాప్తంగా చేపట్టిన రైతుల నిరసనలకు రేపటితో ఏడాది పూర్తవుతోంది.  హర్యాణ, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దుకు చేరుకుని సాగు చట్టాలను రద్ధు చేయాలని నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈనిరసనలకు రేపటితో ఏడాది కావస్తుండటంతో దేశవ్యాప్త బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయి. పలు ప్రజాసంఘాలు కూడా రైతుల దేశవ్యాప్త బంద్ కు సంఘీభావం పలుకుతున్నాయి. తాజాగా మావోయిస్ట్ పార్టీ కూడా బంద్ కు మద్దతు ప్రకటించాయి. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. దీంతో రేపు జరగబోయే బంద్ కు భద్రతను కట్టదిట్టం చేశారు. గతంలో రైతుల నిరసనల్లో చోటు చేసుకున్న హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాంటి తప్పులు జరగకుండా ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో బలగాలను మోహరించారు. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. కేంద్రం కూడా ఈ చట్టాలను రద్దు చేసేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య జఠిలంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version