ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ డేస్ సేల్‌.. ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

-

ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ డేస్ సేల్ ప్రారంభ‌మైంది. ఈ సేల్ జూలై 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో శాంసంగ్‌కు చెందిన ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను ఇస్తున్నారు. గెలాక్సీ ఎ21ఎస్‌, గెలాక్సీ ఎ31, గెలాక్సీ ఎ51, గెలాక్సీ ఎ71, గెలాక్సీ ఎస్10 లైట్‌, నోట్ 10 టైల్ ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. అలాగే అనేక ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఫోన్ల‌ను కొన్న‌వారికి శాంసంగ్ కేర్ ప్ల‌స్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను బండిల్‌గా అందిస్తున్నారు.

సేల్‌లో భాగంగా గెలాక్సీ ఎ21ఎస్ రూ.16,499 ప్రారంభ ధ‌ర‌కు ల‌భిస్తోంది. గెలాక్సీ ఎ31 రూ.20,999 ధ‌ర‌కు, గెలాక్సీ ఎ51, ఎ71 ఫోన్ల‌ను రూ.25,250, రూ.32,999 ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక గెలాక్సీ ఎస్‌10 లైట్‌ను రూ.42,999 ధ‌ర‌కు, నోట్ 10 లైట్‌ను రూ.40,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఆయా ఫోన్ల‌కు గాను శాంసంగ్ కేర్ ప్ల‌స్ ఇన్సూరెన్స్ బండిల్ ప్లాన్ల‌ను అందిస్తున్నారు. త‌క్కువ ఈఎంఐల‌కే ఆ ఫోన్ల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version