ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వైజయంతీ మూవీస్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ముందుగానే ప్రకటించింది. ఆ సర్ ప్రైజ్ ను ప్రభాన్ ఫ్యాన్స్ ముందుంచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందిస్తున్న ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్ ఎవరనే విషయం తెలుపుతూ అందరిలోనూ ఆసక్తి పెంచింది. ఈ సినిమాకు కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుంది.

prabhas

బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే సినిమాలో భాగం కాబోతుందని, రాజుకు పక్కన సరిపోయే రాణి కావాలి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా.. పిచ్చెక్కించేద్దాం’’ అంటూ నాగ్ అశ్విన్ తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులను తెలియజేశాడు. రెబల్ స్టార్ కెరీర్ లో 21వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే పూర్తయినట్లు టాలీవుడ్ టాక్. చిత్రాన్ని సెట్స్ తీసుకురావాలని ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన 20వ చిత్రం రాధేశ్యామ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోందని అందరికి తెలిసిన విషయమే. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version