మొదలైన Samsung Galaxy M13 మొబైల్స్‌ అమ్మకాలు…ప్రైమ్‌ డే సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్‌

-

Samsung Galaxy M13 5G, Samsung Galaxy M13 4G స్మార్ట్‌ఫోన్‌ల సేల్‌ మొదలైంది. ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day Sale) మొదటి రోజు సందర్భంగా అమెజాన్‌లో ఈ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 సిరీస్ మొబైళ్లు తొలిసారి సేల్‌కు వచ్చాయి. సామ్‌సంగ్‌ నుంచి వచ్చిన చౌకైన 5జీ మొబైల్‌గా సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ ఉంది. వీటి ధర అంచనాలకు తగ్గట్టుగానే రిలీజ్‌ అయింది. ఆఫర్లు ఏంటి., కరెక్ట్‌ స్పెసిఫికేషన్స్‌ ఏంటో చూద్దామా..!

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ, గెలాక్సీ ఎం13 ధర..

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ, 4జీ మోడల్స్ చెరో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. గెలాక్సీ ఎం13 5జీ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.13,999 ఉండగా.. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది.
అమెజాన్ ప్రైమ్ డే డీల్స్‌లో భారీ తగ్గింపు ధరలు | టీవీలు మరియు ప్రొజెక్టర్లపై 60% వరకు తగ్గింపు

4జీబీ ర్యామ్ + 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న గెలాక్సీ ఎం13 4జీ మోడల్ రూ.11,999 ధరకు, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.13,999 ధరకు లభిస్తోంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 సిరీస్ మొబైళ్లను కొంటే రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే 4జీ మోడల్ బేస్ వేరియంట్‌ను రూ.9,999కే దక్కించుకోవచ్చు.

Samsung Galaxy M13 4G స్పెసిఫికేషన్లు

6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్ అందించారు.
ఎగ్జినోస్ 850 ప్రాసెసర్‌, ర్యామ్ ప్లస్ ఫీచర్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉంది.
ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
వెనుక మూడు కెమెరాలు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
6000mAh బ్యాటరీ, 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ ఉంది.

Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్లు

6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లాగ్లాస్ 3 ప్రొటెక్షన్
మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌, 11 5జీ బ్యాండ్స్, ర్యామ్‌ను పొడిగించుకునేందుకు ర్యామ్ ప్లస్ ఫీచర్, ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
వెనుక రెండు కెమెరాలు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5000mAh బ్యాటరీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version