శాంసంగ్ కంపెనీ ఇటీవలే తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 20ని విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను భారత్ లో ఆ కంపెనీ భారీగా ధరను తగ్గించింది. ధర తగ్గింపు తాత్కాలికమే అని శాంసంగ్ ప్రకటించింది. రూ.9వేల వరకు ఈ ఫోన్ ధరను తగ్గించారు. ఈ క్రమంలో ప్రస్తుతం తగ్గించిన ధరకే ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.
కాగా గెలాక్సీ నోట్ 20కి చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.77,999 ఉండగా.. ధర తగ్గింపుతో దీన్ని ప్రస్తుతం రూ.68,999కే కొనవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డు దారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.6వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. అంటే ఫోన్ ధర రూ.62,999 అవుతుంది. ఇక ఈ ఆఫర్ ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
గెలాక్సీ నోట్ 20 స్మార్ట్ ఫోన్‌లో… 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 990 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 12, 64, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఎస్ పెన్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.