సందీప్ కిషన్ కొత్త చిత్రానికి క్రేజీ టైటిల్..

-

హీరో సందీప్ కిషన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. హాకీ నేపథ్యంలో సాగే ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రీకరణలో ఉండగానే మరో కొత్త సినిమా మొదలెట్టాడు. రౌడీ బేబీ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా కనిపిస్తుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ చిత్రాల్లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న బాబీ సింహా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పోరేషన్స్, ఎమ్ వీ వీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా వరుస పెట్టి సినిమాలు తీస్తున్న సందీప్ కిషన్, విజయాలు అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. నిను వీడని నీడను నేనే సినిమాకి మంచి ప్రశంసలే వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా వసూలు చేయలేకపోయింది. ఐతే అటు హీరోగా సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్, నిర్మాతగా రాణించేందుకు సిద్ధం అవుతున్నాడు. నిను వీడని నీడను నేనే సినిమాతో నిర్మాతగా మారిన సందీప్ కిషన్, ప్రస్తుతం వివాహ భోజనంబు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version