తెరాసలో సండ్ర చేరిక ఇక లాంఛనమే..

-

తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగి మరోసారి అధికారం చేపట్టిన తెరాసలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేరిక దాదాపు కన్ఫామ్ అయినట్లే అని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తిరుగులేని విజయాలు సాధించిన కారు పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం కాస్త నెమ్మదించింది. అయితే హైదరాబాద్‌లో సైతం సిట్టింగ్ స్థానాలు దక్కించుకోలేని టీడీపీ.. ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను గెలుచుకుంది. వీరిలో సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు తెదేపా తరుఫున గెలుపొందారు.

అయితే ఖమ్మంలోనూ తమ ఆదిపత్యాన్ని కొనసాగించేలా తెరాస యువ నాయకులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆ ఇద్దరు  తెదేపా ఎమ్మెల్యేలు సైతం తెరాసకు జై కొట్టనున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతున్నప్పటికీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఖండించగా.. తానింకా నిర్ణయం తీసుకోలేదని  సండ్రా గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే సండ్ర వెంకట వీరయ్య తెరాసలోకి వెళ్లేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా మకాం వేసిన ఆయన తెరాసకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మరో కీలక నేతతో సండ్ర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతి తర్వాత అధికారికంగానే తెరాస కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version