బుర్ఖాలో సానియా మీర్జా.. ఫొటోలు వైరల్.. షోయబ్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు

-

పవిత్ర రంజాన్ మాసం షురూ కానుంది. ముస్లిం సోదరులంతా ధార్మిక ప్రదేశాలకు పయనమవుతున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా కూడా తన కుటుంబంతో సౌదీ అరేబియాలోని మదీనాకు వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన  ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఈ ఫొటోలు చూసిన సానియా అభిమానులు ఆశ్చర్యపోయారు. సానియాను బుర్ఖాలో చూసి సర్ ప్రైజ్ అయ్యారు. ఈ ఫొటోల్లో ఎక్కడా సానియా భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడంతో.. షోయబ్ ఎక్కడ అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. గత కొంతకాలంగా సానియా, షోయబ్ లు విడిపోయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సానియా తన ఫేర్ వెల్ మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లకు పలువురు రాజకీయ, సినీ, క్రీడా సెలబ్రిటీలు వీక్షించడానికి వచ్చారు. అదే రోజు సాయంత్రం సానియా ఓ ప్రైవేట్ హోటల్ లో డిన్నర్ ఏర్పాటు చేసింది. ఆ డిన్నర్ కు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు.. కానీ ఎక్కడా షోయబ్ కనిపించకపోవడంతో వీళ్లిద్దరు విడిపోయారని నెటిజన్లు కన్ఫమ్ చేసుకున్నారు. ఇప్పుడు మదీనా సందర్శనలో కూడా కుటుంబమంతా ఉండి షోయబ్ కనిపించకపోయే సరికి విడిపోయారని ఫిక్స్ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version