‘నేను క్షేమంగా ఉన్నా’.. షూటింగ్​లో గాయపడ్డారన్న రూమర్స్​పై బాలీవుడ్ స్టార్ క్లారిటీ

-

బాలీవుడ్‌ స్టార్ నటుడు సంజయ్‌ దత్‌ ‘కేడీ సినిమా’ షూటింగ్‌లో గాయపడ్డారంటూ రెండ్రోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు చూసి సంజూ బాబా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడి ఆరోగ్యం ఎలా ఉందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను గాయపడినట్లు వస్తున్న వార్తలపై సంజయ్ దత్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్‌ చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.

‘‘’నాకు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ప్రస్తుతం ‘కేడీ’ (KD) షూటింగ్‌లో బిజీగా ఉన్నా. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు టీమ్‌ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. నాకు గాయాలయ్యాయనుకొని అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు. అందుకే ఈ ట్వీట్‌ చేస్తున్నా. నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ ధన్యవాదాలు’’’ అని సంజూ బాబా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version