ఈ విషయాన్ని స్వయంగా సంజయ్‌దత్ వెల్లడిచాను. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోని పోస్ట్ చేసిన సంజయ్‌దత్ పలు ఆసక్తికరమైన విషయాల్ని అభిమానులతో పంచుకున్నారు. తన తలపై భాగాన్ని చూపించి ట్రీట్‌మెంట్ పూర్తయిందని తన పూర్తిగా కోలుకున్నానని వెల్లడించాడు. తన తనయుడి పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విశేషాలని వెల్లడించారు.
గత కొన్ని వారాలు తనకు, తన కుటుంబానికి అత్యంత పరీక్షా కాలమని చెప్పిన సంజయ్ బలమైన సైనికులకే ఆ దేవుడు కష్టాలు పెడుతుంటాడని, ఈ రోజు తన తనయుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ యుద్ధం నుంచి బయటపడటం ఆనందంగా వుందని, క్యాన్సర్‌ని జయించి పుట్టిన రోజు బహుమతిని అందించానని చెప్పుకొచ్చారు. అందరి ఆశీర్వచనాలు, ఆత్మవిశ్వాసం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా కోకిలాబెన్ ఆసుపత్రి సిబ్బందికి కృత్ఞతలు తెలియజేశారు.