టీం ఇండియాలో చోటు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్ళలో సంజూ సామ్సన్ ఒకడు. కేరళకు చెందిన ఈ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ జట్టులో స్థానంలో ఇప్పటికే అనేక మార్లు తన ప్రతిభను ప్రూవ్ చేసుకున్నాడు. ఐపియల్ ద్వారా ఇప్పటికే తాను ఎంత ప్రమాదకర ఆటగాడినో చాటి చెప్పాడు. అయినా సరే టీం ఇండియాలో అతనికి అవకాశం మాత్రం దక్కడం లేదు.
అయిదేళ్ళ నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. 2015 లో జింబాబ్వే మీద అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత అతనికి అవకాశం మాత్రం రాలేదు. ఆ తర్వాత రెండు మూడు సీరీస్ లకు అతన్ని ఎంపిక చేసారు గాని అవకాశం మాత్రం రాలేదు. డ్రింక్స్ బాయ్ గానే అతని సేవలు పరిమితం అయ్యాయి. ఎట్టకేలకు శ్రీలంక తో జరిగిన మూడో మ్యాచ్ లో అతనికి అవకాశం దక్కింది.
పంత్ స్థానంలో టీంలోకి వచ్చాడు సంజు. అతను అరంగేట్రం చేసిన తర్వాత టీం ఇండియా 73 టి20 మ్యాచ్ లు ఆడిగింది. అప్పటి నుంచి ఇప్పటికి జట్టులో అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఈ యువ ఆటగాడు వాడుకోలేకపోయాడు. రెండు బంతులు ఆడి ఒక సిక్స్ కొట్టి వెళ్ళిపోయాడు. అయితే అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.