సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. పండుగ హుషారు స్టార్ట్ అయింది..భోగి మంటల్లో చలికాచుకోవాలని..సంక్రాంతి సంభరాలు చేసుకోవాలని..కనుమతో పండుగకి ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటికే చాలా ప్లాన్స్ చేసేసుకునుంటారు. అయితే ఇంకా బెర్తులు కన్ఫామ్ కానివారికే టెన్షన్ పెరిగిపోతోంది. రైళ్లన్నీ ఫుల్ కావడంతో టికెట్లు కన్ఫామ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. రద్దీ ఎక్కువవడంతో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. 2020 జనవరి 16న విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు, జనవరి 17న నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయి. ఇందులో 07711 నెంబర్ గల రైలు 2020 జనవరి 16న రాత్రి 11 గంటలకు విజయవాడలో బయల్దేరుతుంది.
మరుసటి రోజు ఉదయం 06.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దారిలో కాజిపేట స్టేషన్‌లో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అలాగే 07412 నెంబర్ గల రైలు 2020 జనవరి 17న రాత్రి 08.05 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 08.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.