సాధారణంగా సినిమాలలో హీరోయిన్లు హీరోలతో ఈజీగా ప్రేమలో పడిపోతూ ఉంటారు.. శుభం కార్డు పడే ముందు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంటారు. కానీ నిజజీవితంలో మాత్రం అలా చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపరు.. వాళ్లకు క్రేజ్ ఉన్నంతవరకు సినిమాలలో అవకాశాలు వస్తూనంత వరకు పెళ్లి జోలికి అస్సలు వెళ్ళరు.. ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతాయో అప్పుడు తమ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం మొదలుపెడతారు. మరి ఆ సమయంలో ప్రేమ పెళ్లి చేసుకుంటారా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అన్నది వాళ్ల నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది..
కానీ వాళ్లు బాగా ఫేమ్ లో ఉన్నన్ని రోజులు పెళ్లి గురించి మాట్లాడితే మాత్రం ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉంటారు.. కానీ హీరోయిన్ సంయుక్త మాత్రం మరొకసారి ఇలాంటి ప్రశ్నలు రాకుండా పెళ్లి అవసరమా? అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.. ఇటీవల సార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సంయుక్త పెళ్లి పై పలు షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంయుక్త మాట్లాడుతూ..” పెళ్లి చేసుకోవాలంటే నా ఆలోచనలకు తగ్గ వ్యక్తి దొరకాలి.. నన్ను ప్రేమగా చూసుకునేవాడు రావాలి.. నా ఎమోషన్స్ ను గౌరవించాలి.. ఇలా అన్ని రకాలుగా నచ్చితే అప్పుడు చూద్దాం .. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు అంటూ హాట్ బాంబు పేల్చింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇటీవల కాలంలో నేను పాల్గొన్న ఇంటర్వ్యూలలో కొంతమంది యాంకర్లు పెళ్లి గురించి అడుగుతున్నారు.. నాతో చాలామంది యువత పెళ్లి అవసరమా అన్నారు. కొంతమంది మహిళలు కూడా చెప్పారు.. మహిళ కుటుంబంలో చాలా కీలకపాత్ర పోషిస్తుంది.. ఇంటి పని చేస్తుంది.. జాబ్ చేస్తుంది.. అలాంటి ఆలోచనలు ఉన్న వారి విధానం చాలా వేరుగా ఉంటుంది . పార్టనర్ సరైన వారు దొరికితేనే మహిళ సేఫ్ గా ఉంటుంది.. లేదంటే పెళ్లి అంటేనే అదొక నరకం అంటూ సంయుక్తా చెప్పుకొచ్చింది