వివేకా హత్య కేసు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలనున కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో హత్య చేసిన వారు జైల్లో ఉండగా, అసలు సూత్రదారి ఎవరు అనే దానిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే… టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. కోడికత్తి కేసు మాదిరి గానే వివేకా హత్య కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో భాగమేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయారని మీడియా ముందు చెప్పిన వైసీపీ ముఖ్యలు ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.