ఐసీఆర్టీసీ భక్తుల కోసం తాజాగా భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఆగస్టు 17- ఆగస్టు 28, 2024న 11 రాత్రులు 12 రోజుల పాటు జరుగనుంది. ఈ టూర్ లో సందర్శన క్షేత్రాల విషయానికి వస్తే.. ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్), ద్వారక [నాగేశ్వర్], సోమనాథ్ [సోమనాథ్], పూణే [భీమశంకర్], నాసిక్ [త్రయంబకేశ్వర్], ఔరంగాబాద్ [గ్రీశ్నేశ్వర్] లలో దర్శనాలను చేయించనున్నారు. ఇక ఈ ప్యాకేజీ ఆగష్టు 17వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరును. మధిర, ఖమ్మం, డోర్నకల్, మహుబ్బాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భవనగిరి, సికింద్రబాద్, కామారెడ్డి, నిజాంబాద్, ధర్మబడ్, మద్దేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా భక్తులను ఎక్కించుకుంటారు.
ఈ టూర్ లో ఉదయం పూట కాఫీ/టీ/అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో రుచికరమైన తెలుగు భోజనం, సాయంత్రం పూట స్నాక్స్/టీ/కాఫీ, రాత్రి సమయంలో అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా తెలుగు వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్లో ఆహార పదార్ధములు చేస్తారు. ఇక బస విషయానికి వస్తే.. క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు చేస్తారు. స్లీపర్ క్లాస్ వారికి నాన్ ఏసీ రూమ్లు., ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్లు, ఇద్దరికి కలిపి లేదా ముగురికి కలిపి ఒక గదిని ఇస్తారు.