నెల్లూరుతోపాటు.. రాయలసీమ జిల్లాలు వైసీపీకి కంచుకోటలాంటివి.. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటనే ఇక్కడి ప్రజలు ఉండేవారు.. 2019 ఎన్నికల్లో వన్ సైడ్ ఫలితాలు వచ్చాయి.. 2024లో అవే ఫలితాలు టీడీపీకి వన్ సైడ్ గా మారాయి.. దీంతో రాయలసీమలో జగన్ కు భంగపాటు తప్పలేదు.. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ మార్పులకు శ్రీకారం చుట్టారు.. జిల్లాఅధ్యక్షులను,ఇన్చార్జులను మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించారు..
రాయలసీమలో పార్టీ పూర్వ వైభవానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఇప్పటికే సూచించారు.. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది..
గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరిట.. మూడు ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని వైసీపీ అధినేత జగన్ భావించారు.. అందులో భాగంగా లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూల్ లో ఏర్పాటు చేశారు.. లా యూనివర్శిటీని కూడా తీసుకొచ్చింది.. హై కోర్టుని కర్నూల్ కి తరలించాలని ప్రయత్నించినా.. అది వర్కౌట్ అవ్వలేదు.. కానీ రాయలసీమ అభివృద్దికి వైసీపీ సహకరించిందన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా ఉంది..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించాలని ప్రయత్నిస్తుండటంపై ఆ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు.. ఈ వ్యవహారాన్నే వైసీపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోందట.. ఈ రెండు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీ మైలేజ్ ను పెంచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట.. ఇప్పటికే రాయలసీమ నేతలకు దిశానిర్దేశం కూడా చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. కర్నూల్ కేంద్రంగా న్యాయ కార్యాలయాల తరలింపు అంశాన్ని వైసీపీ రాజకీయంగా ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తోంది.. ఇదే జరిగితే.. టీడీపీకి డ్యామేజ్ తప్పదనే టాక్ సైకిల్ పార్టీలో వినిపిస్తోంది.