భవన నిర్మాణ అనుమతులకు కోసం కొత్త విధానం : మంత్రి నారాయణ

-

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నాం అని తెలిపారు. ఇక డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతాం. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతనే కొత్త విధానాలను రూపొందించాం అని పేర్కొన్నారు.

అయితే నకరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల అభివృద్ధి కోసం ప్రజలు తాము చెల్లించాల్సిన పనులను సత్వరమే కట్టాలి అని కోరారు. ఇక ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ను కూడా నిర్వహిస్తాం. అభివృద్ధికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలి. ఇందులో వాణిజ్య సంస్థలు భారీగా బకాయిలను చెల్లించాల్సి ఉంది. కాబట్టి మునిసిపల్ శాఖ మంత్రిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా… అందరూ సహకరించి పనులను చెల్లించాలి అని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version