రష్మిక మందనతో విజయ్ డేటింగ్.. సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

-

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ షో కాఫీ విత్ కరణ్ ..ప్రజెంట్ ఓటీటీ..డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో హోస్ట్ అయిన ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్..సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలు, రూమర్స్ పై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ విషయాలను మెల్లగా బయటకు లాగుతుంటారు. ఈ క్రమంలోనే బ్యూటిఫుల్ హీరోయిన్స్ సారా అలీఖాన్, జాన్వికపూర్ లను తాజాగా కరణ్ ఇంటర్వ్యూ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఈ ఎపిసోడ్ లో కరణ్ జోహార్ ఇరువురు హీరోయిన్స్ నుంచి షాకింగ్ సమాధానాలను రాబట్టినట్లు తెలుస్తోంది. సారా అలీఖాన్ గతంలో ఈ షోలో తన క్రష్ ఎవరో చెప్పేసిందట. కార్తీక్ ఆర్యన్ అంటే తనకు చాలా ఇష్టమని సారా అలీఖాన్ తెలిపింది. ‘లవ్ అజ్ కల్’ చిత్ర షూటింగ్ టైమ్ లో వీరిరువురు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, సారా అలీ ఖాన్ ను ఈ విషయమై కరణ్ ప్రశ్నించగా, ఆమె సీక్రెట్ రివీల్ చేసింది. కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ వెళ్లినట్లు సారా అలీఖాన్ స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ లో కరణ్ జోహార్..సారా అలీఖాన్, జాన్వికపూర్ లను ప్రశ్నిస్తున్న క్రమంలో ర్యాపిడ్ ఫైర్ లో విజయ్ దేవరకొండ-రష్మిక మందనల గురించి వారు మాట్లాడినట్లు వార్తలొస్తున్నాయి. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో జంటగా నటించిన వీరిరువురు డేటింగ్ లో ఉన్నట్లు కొంత కాలం నుంచి వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే, అఫీషియల్ గా వీరిరువురు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రష్మిక మందన ఇన్ స్టా ఫాలోవర్స్ పైన తను ఒక కన్ను వేసి ఉంచినట్లు జాన్వికపూర్ షోలో చెప్పిందట. కాగా, సారా అలీ ఖాన్ రష్మిక మందన-విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారా? అని ఇన్ డైరెక్ట్ గా ఉండి ఉండొచ్చన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version