గ్రేటర్లో కమలం జోరు…కారుని దాటుతుందా?

-

తెలంగాణ రాజకీయాల్లో సర్వేలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి…రోజుకో కొత్త సర్వే బయటకొస్తూ…పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒకో సర్వేలో ఒకోలా ఫలితం కనిపిస్తుంది…అలాగే జిల్లాల వారీగా కూడా సర్వే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ మాత్రం నడుస్తుందని అర్ధమవుతుంది.

ఇప్పటికే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది..ఈ పోరులో టీఆర్ఎస్ కాస్త లీడ్ లోకి వచ్చింది. అయితే తాజాగా వెలువడుతున్న అసెంబ్లీ స్థానాల సర్వేల్లో కూడా బీజేపీ కంటే టీఆర్ఎస్ కాస్త ముందుందని తేలింది. హైదరాబాద్ లో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. ఇందులో 7 సీట్లు ఎం‌ఐ‌ఎం కు పక్కన పెట్టేయాల్సిందే. ఆ పార్టీకి 7 సీట్లలో గెలిచే బలం ఉంది…గత ఎన్నికల్లో కూడా 7 సీట్లలో గెలిచింది…నెక్స్ట్ కూడా ఆ పార్టీకి ఖచ్చితంగా ఆ సీట్లలో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

ఇక 7 సీట్లు పక్కన పెడితే…మిగిలిన 8 సీట్లలో టీఆర్ఎస్-బీజేపీలు పోటీపడుతున్నాయి. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో ఏడుస్థానాల్లో (మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్‌, యాకుత్‌పుర, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌) మజ్లిస్‌ తిరిగి గెలుస్తుంది. ఇక సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలుండగా.. గోషామహల్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. అటు ఖైరతాబాద్‌ సీటులో మూడు పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి.అయితే టీఆర్ఎస్-బీజేపీలు సమానంగా సీట్లు దక్కించుకుంటున్నాయి. ఇక హైదరాబాద్ లో బీజేపీ ఇంకా జోరు పెంచితే గాని…కారుని నిలువరించగలుగుతుంది..ఎన్నికల నాటికి బీజేపీ ఇంకా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానాల్లో బీజేపీ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇటు ఖైరతాబాద్ లో కూడా బీజేపీకి బలం ఉంది. ఇంకా బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తూ…మిగిలిన స్థానాల్లో కూడా బలం పెంచుకుంటే..నెక్స్ట్ ఎన్నికల్లో గ్రేటర్ లో కమలం హవా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version