గత కొద్ది రోజులుగా సీనియర్ హీరో మరియు సహనటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్సను తీసుకుంటున్నారు. ఈయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లు తమ కుటుంబ సభ్యులకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ అడ్డమైన సోషల్ మీడియా వలన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఈయన సజీవంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కొందరు శరత్ బాబు చనిపోయారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శరత్ బాబు సోదరి ఎంతో బాధతో స్పందించారు.