ఈ రోజు డబుల్ ధమాకాలో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్యన మొహాలీలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచినా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ సాలిడ్ గానే ఆడుతోంది. ముంబై లాంటి బలమైన జట్టు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టడానికి చమటోడుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టన్ తన ఫామ్ ను దొరకబుచ్చుకున్నాడు. గత మ్యాచ్ లలో పేలవమైన ఆటతీరుతో ఫ్యాన్స్ ను విసిగించిన ఇతను ఈ మ్యాచ్ లో మాత్రం చాల కంట్రోల్ గా ఆడుతూ ఇన్నింగ్స్ ను ఒక భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్తున్నాడు.
ఐపీఎల్ 2023: ముంబైపై “లివింగ్ స్టన్” అర్ద సెంచరీ !
-