ఓటీటీలో కార్తి ‘సర్దార్’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

-

తమిళ్ సూపర్ స్టార్ సూర్యా తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు కార్తి. మొదటి సినిమా యుగానికి ఒక్కడుతోనే టాలీవుడ్ ఫ్యాన్స్ ని తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా అటు తమిళ్ లో ఇటు తెలుగులో ప్యార్లల్ గా సినిమాలు చేస్తూ తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఇక కార్తి నేరుగా తెలుగులో చేసిన మూవీ ఊపిరి. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ఈ మూవీతో కార్తి పూర్తిగా తెలుగువాడైపోయాడు.

అప్పట్నుంచి కార్తి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా కార్తి కీలక పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్‌ ‘సర్దార్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర తెలుగు, తమిళ ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో  ‘సర్దార్’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version