అరేయ్.. చాలా తలనొప్పిగా ఉంది. ఓ సారిడాన్ టాబ్లెట్ పట్టుకురారా? భరించలేకపోతున్నా? బాబూ.. ఓ సారిడాన్ టాబ్లెట్ ఇవ్వవా? ఇలా.. పెయిన్ కిల్లర్ సారిడాన్ ను ఉపయోగించని వాళ్లు ఉండరు. అంతనా జనాలకు పరిచయం అయింది సారిడాన్. కానీ.. ఇక నుంచి మీకు సారిడాన్ దొరకదు. అవును.. అదొక్కటే కాదు.. దాదాపు 328 పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను కేంద్రం నిషేధించింది.
ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్స్(ఎఫ్డీసీ) ఔషధాలను కేంద్రం నిషేధించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి రానుంది. ఈ గొడవ ఇప్పటిది కాదు.. 2016లోనే ప్రారంభమయింది. ఔషధ తయారీ సంస్థలు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న వార్ కు ఇప్పుడు పుల్ స్టాప్ పడింది. ఇవి చాలా ప్రమాదకరమని.. దీంతో సారిడాన్, స్కిన్ క్రీమ్ పెండర్మ్, మధుమేహానికి సంబంధించిన ఔషధాలు, గ్లుకోనార్మ్ పీజీ, యాంటి బయోటిక్ ఔషధం లుపిడిక్లాక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఔషధం ట్యాక్సిమ్ ఏజెడ్ లాంటి డ్రగ్స్ ఇక నుంచి మార్కెట్ లో కనిపించవు.
నిజానికి మార్చి 10, 2016లోనే ప్రభుత్వం 344 ఎఫ్డీసీలపై నిషేధం విధించింది. దీంతో డ్రగ్స్ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. డిసెంబర్ 15, 2017 న సుప్రీం డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(డీటీఏబీ) ద్వారా పరీక్షలు చేసి అవి ప్రమాదకరమైనవా కాదా తేల్చాలని తీర్పు ఇచ్చింది. దీంతో పరీక్షల అనంతరం 328 డ్రగ్స్ ప్రమాదకరమైనవని పరీక్షల్లో తేలింది. దీంతో వాటిని నిషేధించాలని ప్రభుత్వానికి సూచించడంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.