సరోజినీ నాయడు వర్ధంతి: ఆమె సేవలు తరతరాలకీ ఆదర్శం…!

-

సరోజినీ నాయుడు ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ గా ప్రసిద్ధి చెందారు. ఈమె స్వతంత్ర సమరయోధులు మరియు కవయిత్రి. ఈమె పద మూడవ సంవత్సరం లోనే ”ది లేడీ ఆఫ్ ద లేక్” పేరున 13 వందల పంక్తుల కవితను ఆరు రోజుల్లో రాశారు. నిజంగా ఎంత గొప్ప విషయమో కదా…! ఈమె హైదరాబాదు లో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు. ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ గొప్ప విద్యావేత్త. ఈమె తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి.

సరోజినీ నాయుడు 1936 సంవత్సరం లో ఉప్పు సత్యాగ్రహం లో మహాత్మా గాంధీ తో పాటు పాల్గొన్నారు. ఆమె మొదట 1905లో గోల్డెన్ త్రెషోల్డ్ అనే కవిత్వం రచించారు. సరోజినీ నాయడుకి నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రత్యేక గుర్తింపు లభించింది. అలానే ఈమె ”ది బర్డ్ ఆఫ్ టైం”, ” ది బ్రోకెన్ వింగ్”, ”పాలన్క్విన్ బేరియర్స్” వంటివి ఎన్నో అద్భుతమైన కవితలు రచించారు.

చిన్నతనం నుంచి ఈమెకు ఇంగ్లీష్ భాష మీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీష్ మాట్లాడాలని ఆమె ఎంత గానో ప్రయత్నం చేసేది. నిజంగా ఆమె పట్టుదల ఆమె ధ్యేయం ఆమెను నడిపించాయి. ఆమె అనుకున్నది సాధించడానికి ఆమె ఎంత గానో తపించేవారు. నిజంగా శ్రీమతి సరోజినీ నాయుడు ఆదర్శమూర్తి.

సరోజినీ నాయుడు అంతిమ సందేశం:

సరోజినీ నాయుడు 1949 మార్చి 2వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్నుమూశారు. ఆమె జీవితమంతా మానవ సేవకు, దేశ సేవకు అంకితం చేసి ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య, రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలచుకున్న వారికి మార్గాలు అనేకం అని నిరూపించారు. నిజంగా ఈమె తరతరాలకీ ఆదర్శమే…!

Read more RELATED
Recommended to you

Exit mobile version