ఆయన ఒక ప్రజాప్రతినిది గ్రామ ప్రథమ పౌరుడు.. కరోన వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలలో వైరస్ పై అవగాహన కలిపించి ప్రజలకు కష్టకాలంలో అండగా ఉండాల్సిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు…మందు, చిందు, డీజే సౌండ్ తో మాస్కులు సామాజిక దూరం పాటించకుండా లాక్డౌన్ నిబందనలను తుంగలో తొక్కి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పెళ్లి , చవులకే 20 మందిని మించకూడదు అన్న నిబందన కేవలం సామాన్య ప్రజలకేనా ప్రజాప్రతినిధులకు ఉండవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు