శశి టీజర్: ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్..

-

ఆది సాయికుమార్.. ప్రేమ కావాలి అనే సినిమాతో పరిచయమైన ఆది, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఐతే ఆ తర్వాత ఆది చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఒకటి రెండు మినహా ఇప్పటికీ సరైన హిట్ పొందలేదు. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ఆది, ప్రస్తుతం మూడు సినిమాలని లైన్లో పెట్టాడు. ఆ మూడు కూడా విభిన్నమైన కాన్సెప్టులు కావడం విశేషం. ప్రస్తుతం ఆ మూడింటిలో నుండి శశి సినిమా టీజర్ రిలీజైంది.

ఈ టీజర్ లో ఆది, రెండు రకాల గెటప్పుల్లో కనిపించాడు. కాలేజీలో ఉన్నప్పుడు యంగ్ గా, అలాగే ప్రేమలో విఫలమైనప్పుడు రఫ్ గా కనిపించాడు. చూస్తుంటే సినిమా మొత్తం ప్రేమ చుట్టూ తిరిగుతున్నట్టే ఉంది. ప్రేమ గురించి ఆది చెప్పిన డైలాగులు బాగున్నాయి. మనకు నచ్చినట్టు మనం లేకపోతే లైఫ్ ఉండి వేస్ట్. అలాగే మనకి కావాల్సింది గట్టిగా అడక్కపోతే గోల్ ఉండి వేస్ట్.. వంటి మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. సురభి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ నాయుడు నందికట్ల డైరెక్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version