టాలెంటెడ్ హీరోస్ స‌త్య‌దేవ్, శ్రీవిష్ణుల‌కు బంప‌రాఫ‌ర్..!

-

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోస్ గుర్తింపు తెచ్చుకున్న హీరోల‌లో స‌త్య‌దేవ్, శ్రీవిష్ణు కూడా ఉంటారు. ఈ ఇద్ద‌రు హీరోలు విభిన్న క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రికీ ఓ బంపార‌ఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. బ‌డా ప్రొడ‌క్ష‌న్ హౌస్ 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్టైన్మెంట్స్ ఈ ఇద్ద‌రు హీరోల‌తో సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకుందంట‌. ఇప్ప‌టికే ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇద్ద‌రు హీరోల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి క‌థ‌ల‌ను కూడా వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

అంతే కాకుండా ఈ హీరోల‌ను మంచి రెమ్యున‌రేష‌న్ ను కూడా ఆఫ‌ర్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో సినిమా చేసేందుకు ఇద్ద‌రూ ఓకే చెప్పార‌ట‌. ఇదిలా ఉంటే ఇదే బ్యాన‌ర్ లో ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నారు. అయితే ఈ బ‌డా బ్యాన‌ర్ స్టార్ ల‌తోనే కాకుండా టాలెంటెడ్ హీరోల‌తోనూ సినిమాల‌ను తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే క‌థ‌లు వినిపిస్తూ టాలెంటెడ్ హీరోల‌ను లైన్ లో పెడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version